‘వికసిత్ భారత్ అనేది కేవలం ప్రచార ఆర్భాటం. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం తప్ప మరొకటి కాదు’
– కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ విమర్శ.
‘ప్రధాని మోదీ బడేభాయ్ లాంటివారు. మీరు సహకరిస్తే మేము కూడా వికసిత్ భారత్‌లో భాగస్వాములం అవుతాం’
– సీఎం రేవంత్ రెడ్డి పొగడ్త.
హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్ చెప్తున్న మాటలు, చేస్తు న్న పనులు చూస్తుంటే ఆయన కాంగ్రెస్ ము ఖ్యమంత్రా? లేక బీజేపీ ముఖ్యమంత్రా? అనే సందేహం కాంగ్రెస్ శ్రేణుల్లో కలుగుతున్నది. ఇప్పటికే అనేకమార్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా బీజేపీకి అనుకూలంగా రేవంత్ వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. తాజాగా ఆయన మ రోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. కేంద్రం చేపట్టిన ‘వికసిత్ భారత్’ కార్యక్రమాన్ని ప్రచా ర ఆర్భాటమని కాంగ్రెస్ జాతీయ స్థాయిలో విమర్శిస్తున్నది. కానీ ఇక్కడ రేవంత్ మాత్రం ‘వికసిత్ భారత్‌లో భాగస్వాములమవుతాం’ అంటూ ప్రకటన చేశారు. అంతేకాదు ప్రధాని మోదీని మరోసారి బడేభాయ్ అంటూ ప్రశంసించారు. దీంతో సీఎం వ్యవహారశైలి అటు కాంగ్రెస్ పార్టీలో ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మంగళవారం హైదరాబాద్‌లోని హోటల్ ఐటీసీ కోహినూర్‌లో దక్షిణ-పశ్చిమ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల అర్బన్ డెవలప్మెంట్ మంత్రుల ప్రాంతీయ సమావేశం జరిగింది. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘వికసిత్ భారత్‌లో భాగంగా 2047 నాటికి దేశాన్ని 30ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా, ప్రపంచంలోనే ఓ గొప్ప దేశంగా తీర్చిదిద్దాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. పట్టణాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టడం, హైదరాబాద్ నగరానికి సహకరించడాన్ని మా ప్రభుత్వం స్వాగతిస్తున్నది. మేము అనేక అభివృద్ధి ప్రణాళికలను కేంద్రానికి, మోదీకి అందించాం. వారు వాటిని సానుకూలంగా పరిశీలిస్తున్నారు. వేగంగా అనుమతులివ్వడం ద్వారా నగరాభివృద్ధికి సహకరించాలని కోరుతున్నా’ అని పేర్కొన్నారు. మోదీ చెప్తున్న వికసిత్ భారత్ తరహాలో తాము తెలంగాణ రైజింగ్-2047 బృహత్ ప్రణాళికను రచిస్తున్నామన్నారు.
డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరిస్తామని చెప్పారు. 2047నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. 2047నాటికి దేశా న్ని 30ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మోదీ ఎలా పనిచేస్తున్నారో, తాము అందులో 10% కాంట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా మెట్రో విస్తరణ, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు, రీజినల్ రింగ్‌రోడ్డు, రేడియల్ రోడ్లు, హై దరాబాద్ తాగునీటి కోసం కృష్ణా, గోదావరి జలాల తరలిం పు, కాలుష్యాన్ని తొలగించేందుకు 3 వేల ఎలక్ట్రిక్ బస్సు లు, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, మూసీ ప్రక్షాళన తదిత ర ప్రాజెక్టులను ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలనుకుంటున్నట్టు తెలిపారు. 30 వేల ఎకరా ల్లో ఫ్యూచర్ సిటీని నిర్మించాలని అనుకుంటున్నామని చెప్పారు. దీనికోసం కేంద్రం సహకారం అవసరమని కోరారు.
ప్రసంగంలో భాగంగా ప్రధాని మోదీ పెద్దన్నలాంటివారని సీఎం వ్యాఖ్యానించారు. ‘మీరు(మనోహర్ లాల్ ఖట్టర్) కూడా సీఎంగా పని చేశారు. మోదీ పన్నెండేండ్లు సీఎంగా చేశా రు. మోదీ గుజరాత్ మోడల్‌ను రూపొందించారు. ఇద్దరూ సీఎంలుగా పనిచేసినవారే కావడంతో మీకు సీఎంల ఇబ్బందులు తెలుసు. కేంద్రం సహకరించకుంటే రాష్ర్టాల అభివృద్ధి సాధ్యంకాదు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మీరు సహకారం అందించాలి. నాలాంటి యువ ముఖ్యమంత్రికి మీ సహకారం ఎంతో అవసరం. మోదీని పెద్దన్నగా భావిస్తున్నాం. మీరు సహకరిస్తే మేము కూడా వికసిత్ భారత్‌లో భాగస్వాములం అవుతాం. మేము కోరి న ప్రాజెక్టులను మంజూరు చేయండి. మీతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉ న్నాం’ అని రేవంత్ పేర్కొన్నారు.
ఎన్నికలప్పు డు రాజకీయాలు చేస్తామని, ఆ తర్వాత ఎటువంటి రాజకీయ ప్రకటనలు చేయనని హామీ ఇస్తున్నానని చెప్పారు. అభివృద్ధి ఒక్కటే తన ఎజెండా అన్నారు. ఏమైనా లోపాలుంటే వాటిని సవరిస్తున్నామని తెలిపారు. ‘మీ నేతృత్వంలో మా నగరాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీ సహకారం, మీ అనుభవం మాకు అవసరం. మీ సమర్థ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మోదీ, ఖట్టర్ ఇద్దరూ హైదరాబాద్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారని ఆశిస్తున్నా’ అని సీఎం వివరించారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఇప్పుడు కాంగ్రెస్‌తోపాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చ జరుగుతున్నది. ఢిల్లీ పెద్దలను కాదని, పార్టీ జాతీయ విధానాలకు వ్యతిరేకంగా రేవంత్ వ్యవహరించడంపై భిన్న కోణాల్లో విశ్లేషిస్తున్నారు.
వికసిత్ భారత్-2047పై నీతిఆయోగ్ ఏర్పాటు చేసిన సమావేశం సందర్భంగా కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ విమర్శలు గుప్పించారు. వికసిత్ భారత్ అనేది కేవలం ప్రచార ఆర్భాటం, సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం తప్ప మరొకటి కాదు అని ఎద్దేవా చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని ఆయన ప్రశ్నించారు. ఆర్థిక అసమానతలు, ప్రజాస్వామ్య సంస్థలపై జరుగుతున్న దాడులను కప్పిపుచ్చేందుకే మోదీ వికసిత్ భారత్ నినాదాన్ని అందుకున్నారని విమర్శించారు. వికసిత్ భారత్ పేరుతో తమ రాజకీయ ఉద్దేశాలను రాష్ర్టాలపై రుద్దేందుకు ప్రయత్నించడం సరికాదని వ్యాఖ్యానించారు.