Loksabha Elections 2024 : ఓటర్ల ముఖాలను చూసి ఓటువేసేందుకు అనుమతించాలని హైదరాబాద్ లోక్సభ బీజేపీ ఎంపీ అభ్యర్ధి మాధవీలత పోలింగ్ కేంద్రంలో వాగ్వాదానికి దిగారు. ఓటర్లను గుర్తించకుండా ఓటు వేసేందుకు ఎలా అనుమతిస్తారని ఆమె నిలదీశారు. అయితే కాషాయ పార్టీ అభ్యర్ధి తీరుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
ఓటర్ల ఐడీలను బీజేపీ అభ్యర్ధి మాధవీలత పరిశీలిస్తున్న వీడియోపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా సీఎం బదులిచ్చారు. ఆ వీడియోను తాను చూడలేదని, అయితే బీజేపీ గెలుపు కోసం ముస్లిం ఓట్ల పోలరైజేషన్ కోసం ప్రయత్నిస్తోందని అన్నారు.
కానీ బీజేపీ ప్రయత్నాలు, ఆ పార్టీ చర్యలు అసదుద్దీన్కే మేలు చేస్తాయని, ఇవి బీజేపీకి ఎలాంటి ప్రయోజనం కల్పించవని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 11 గంటల వరకూ 24 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు.
Read More :
CM Jagan | పులివెందులలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన ఏపీ సీఎం జగన్