Revanth Reddy | సీఎం రేవంత్‌రెడ్డికి హైకోర్టులో ఊరట.. ఐదు క్రిమినల్ కేసులు కొట్టివేత
Revanth Reddy | హుజూర్నగర్ ఉపఎన్నికల సందర్భంగా నమోదైన కేసుల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హైకోర్టులో బుధవారం ఊరట లభించింది.
Revanth Reddy | హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): హుజూర్నగర్ ఉపఎన్నికల సందర్భంగా నమోదైన కేసుల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హైకోర్టులో బుధవారం ఊరట లభించింది. ఆయనపై నమోదైన ఐదు క్రిమినల్ కేసులను కొట్టివేస్తూ బుధవారం హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. అప్పట్లో ఎంపీగా ఉన్న రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన పద్మావతిరెడ్డి తరఫున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అనుమతి లేకుండా రేవంత్‌రెడ్డి రోడ్‌షో నిర్వహించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారని, సమావేశాల్లో లౌడ్స్పీకర్లు, మ్యూజిక్లతో ప్రజలకు అసౌకర్యం కలిగిందని అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదయ్యాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ తనపై వేర్వేరుగా నమోదైన ఐదు క్రిమినల్ కేసులను కొట్టివేయాలని కోరుతూ రేవంత్‌రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు.
వీటిపై విచారించిన జస్టిస్ కే సుజన కేసులను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఎన్నికల కేసులను నిబంధనలకు అనుగుణంగా నమోదు చేయలేదని, వీటిపై తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ కేసులు కొట్టివేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

