హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఘనంగా నివాళులు అర్పించారు. అణగారిన వర్గాల సంక్షేమం, మహిళల సాధికారత కోసం బాబాసాహెబ్ చేసిన అవిశ్రాంత పోరాటం ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాధ్యం చేసిన అంబేద్కర్ రాజ్యాంగం ప్రజా పాలనకు దిక్సూచి అని గుర్తుచేశారు. మహాశయుని ఆశయాల స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతి కోసం ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి నిర్ణయాలతో సామాజిక న్యాయం కోసం అవిరాళ కృషి చేస్తోందని చెప్పారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరుతో నాలెడ్జ్ సెంటర్లు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా నాణ్యమైన విద్యను, రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతకు స్వయం ఉపాధి అవకాశాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. బాబాసాహెబ్ స్వప్నాలను నిజం చేయడానికి అందరూ కలిసి పాటుపడాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి @revanth_anumula గారు ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించారు. అణగారిన వర్గాల సంక్షేమం, మహిళల సాధికారత కోసం బాబాసాహెబ్ గారు చేసిన అవిశ్రాంత పోరాటం ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
తెలంగాణ… pic.twitter.com/TSxdaHT35N
— Telangana CMO (@TelanganaCMO) April 14, 2025
‘ఎస్సీ వర్గీకరణ ద్వారా మూడు దశాబ్దాల పోరాట ఆకాంక్షలను నెరవేర్చడం, విద్యా, ఉద్యోగ, స్థానిక రాజకీయాల్లో బడుగు బలహీనవర్గాలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు చట్టరూపం ఇవ్వడం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ద్వారా పేదబిడ్డలకు నాణ్యమైన విద్య అందించాలని సంకల్పం తీసుకోవడం.. రైతుకు, రైతు కూలీలకు ఇందిరమ్మ భరోసాగా ఎకరాకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక భరోసా, పేదవాడి ఆకలి తీర్చడమే కాదు.. ఆరోగ్యం, ఆత్మగౌరవం కాపాడాలని సన్నబియ్యం పథకానికి శ్రీకారం, పేదల ఆత్మగౌరవ ప్రతీకగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించడం, రైతు, పేదలకు భూమికి హక్కుపై భరోసా ఇస్తూ భూ భారతికి శ్రీకారం చుట్టడం.. అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రజా ప్రభుత్వం వేసిన కొన్ని అడుగులు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళి.’ అని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
ఎస్సీ వర్గీకరణ ద్వారా మూడు దశాబ్దాల పోరాట ఆకాంక్షలను నెరవేర్చడం…
విద్యా, ఉద్యోగ, స్థానిక రాజకీయాల్లో బడుగు బలహీనవర్గాలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు చట్టరూపం ఇవ్వడం…
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ద్వారా పేదబిడ్డలకు నాణ్యమైన విద్య అందించాలని సంకల్పం తీసుకోవడం…
రైతుకు,… pic.twitter.com/XMiBzMy96w
— Revanth Reddy (@revanth_anumula) April 14, 2025