Revanth Reddy | హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ) : సచివాలయంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 177 మంది సెక్షన్ ఆఫీసర్లు బదిలీ అయినప్పటికీ చాలా మంది కొత్త పోస్టుల్లో చేరకపోవడంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. బదిలీలను ఆపేందుకు పైరవీలు చేస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. ఈ విషయం సీఎం రేవంత్‌రెడ్డికి తెలిసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
పైరవీలను ప్రోత్సహించొద్దని, అందరూ కొత్త పోస్టుల్లో చేరాల్సిందేనని ఆదేశించినట్టు తెలిసింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సీఎస్‌కు సూచించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అందరినీ ఒక ప్రత్యేకమైన కారణంతోనే బదిలీ చేశారని, పైరవీలు చేసి పాత స్థానాల్లోకి వస్తే లక్ష్యం నెరవేరదని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం.