హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్‌హెచ్చార్డీలో జరిగిన ఈ భేటీలో.. కొత్త జిల్లాలో కోర్టుభవనాలు, మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకాలు చేపట్టాలని ఈ సందర్భంగా జస్టిస్ అపరేశ్‌కుమార్ సూచించారు.
ఈ అంశాలకు సంబంధించిన పలు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. భేటీలో జస్టిస్ సామ్కోసి, జస్టిస్ అభినంద్కుమార్శావిలి, సీఎస్ రామకృష్ణారావు, అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.