బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 02, 2020 , 18:34:53

బ్లాక్‌ మెయిలింగ్‌కు రేవంత్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌

బ్లాక్‌ మెయిలింగ్‌కు రేవంత్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డిపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బ్లాక్‌ మెయిలింగ్‌కు రేవంత్‌ రెడ్డి బ్రాండ్‌ అంబాసిడర్‌ అని సుమన్‌ ధ్వజమెత్తారు. రేవంత్‌ బతుకంతా బ్లాక్‌మెయిల్‌ బతుకు.. తామేమో ఉద్యమకారులమన్నారు. ఎదుటివారిపైనా బురద జల్లడమే ఆయన పని అని సుమన్‌ దుయ్యబట్టారు. తెలంగాణ భవన్‌లో బాల్క సుమన్‌ మీడియాతో మాట్లాడారు. గోపన్‌పల్లి భూకబ్జాలపై రేవంత్‌ రెడ్డి నోరు విప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి రేవంత్‌ కుటిల ప్రయత్నాలు చేస్తున్నాడని పేర్కొన్నారు. రేవంత్‌ నిజస్వరూపం మరోసారి బట్టబయలైందన్నారు. ఆయన వ్యవహారం దొంగేదొంగ అని అరిచినట్లుగా ఉందని నిప్పులు చెరిగారు బాల్క సుమన్‌.

2014, 2018 ఎన్నికల ఆఫిడవిట్లలో భూముల వివరాలను కేటీఆర్‌ స్పష్టంగా చూపించారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తెలిపారు. శంకర్‌పల్లి ఫామ్‌హౌస్‌ను కేటీఆర్‌ లీజుకు తీసుకున్నారని సుమన్‌ స్పష్టం చేశారు. లీజు ప్రకారం డబ్బులు కూడా చెల్లిస్తున్నారని తేల్చిచెప్పారు. రేవంత్‌ రెడ్డిపై ఎన్నో భూ బాగోతాలు బయటకు వచ్చాయి. ఒక్కదానిపై కూడా రేవంత్‌ వివరణ ఇవ్వలేదు అని సుమన్‌ పేర్కొన్నారు. కేటీఆర్‌ ఇమేజ్‌ను దెబ్బతీయడానికి రేవంత్‌ కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రలకు భయపడమని బాల్క సుమన్‌ స్పష్టం చేశారు.logo