హైదరాబాద్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) రాష్ట్రంలో పర్యటించనున్నారు. దీంతో ఆయనకు స్వాగంతం పలుకుతూ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిలో ప్రముఖ పారిశ్రామిక వేత్త అదానీతో కలిసి రేవంత్ రెడ్డి దిగిన ఫ్లెక్సీలు కూడా ఉన్నాయి. దీనిపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు అదానీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ విమర్శలు గుప్పిస్తుండగా, రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఆయనతో అంటకాగుతున్నారని విమర్శిస్తున్నారు. అదానీ విషయంలో అసలు రాహుల్‌తోపాటు పార్టీ వైఖరి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
పార్టీ అధిష్టానికి వైఖరికి వ్యతిరేకంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదానీ కంపెనీతో ఒప్పందం చేసుకోవడం, పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తీవ్ర ప్రజావ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ రామన్నపేటలో అంబానీకి చెందిన అంబూజా సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని మండిపడుతున్నారు. ఇది అంబానీ-రేవంత్ బందానికి నిదర్శణమని చెబుతున్నారు.
Team “RADANI” Welcomes@RahulGandhi ji … pic.twitter.com/Gkjy9SA2eX
— Krishank (@Krishank_BRS) November 5, 2024