Musi Project | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): మూసీ ప్రాజెక్టుపై రేవంత్ సర్కారుకు స్పష్టత లోపించినట్టు నిపుణులు, ఇంజినీర్లు అభిప్రాయపడుతున్నారు. మూసీ ప్రాజెక్టుకు లండన్‌లోని థేమ్స్ మాడల్‌ను అనుసరిస్తామని ఒకసారి, ప్రక్షాళన చేపడుతామని మరోసారి, మూసీ సుందరీకరణ చేపడుతామని ఇంకోసారి, సుందరీకరణ కాదు నదీ పునరుజ్జీవనానికే కట్టుబడి ఉన్నామని మరోసారి సీఎం రేవంత్ పలు విధాలుగా ప్రకటనలు చేయడమే ఉదాహరణగా చెప్తున్నారు. తాజాగా దక్షిణ కొరియాలోని సియోల్‌లో ఉన్న చుంగ్ గై చున్ రీస్టోరేషన్ ప్రాజెక్టును పరిశీలించేందుకు ప్రభుత్వ బృందం సిద్ధమైంది. దీంతో నదులకు సంబంధించిన ప్రాజెక్టులు ఎన్ని రకాలన్న దానిపై చర్చ మొదలైంది.
నదీ ప్రాజెక్టులు-రకాలు