హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా రియల్ ఎస్టేట్ దందా ( Real Estate ) చేస్తున్నారని అసెంబ్లీ విప్ కేవీ వివేకానంద ( MLA KP Vivekananda ) ఆరోపించారు. తెలంగాణ భవన్ లో శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం 12 వేల కోట్ల విలువైన భూములు అమ్మి వాటితో ఏం చేశారో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
రాయదుర్గం వద్ద ఉన్న భూమికి హైకోర్టులో ఉత్తర్వులు ఉన్నా ఈవేలం ద్వారా వేరే కంపెనీకి విక్రయించారని, ప్రభుత్వం దిగజారుడికి నిదర్శనమని విమర్శించారు. .హిల్ట్ పాలసీ ద్వారా భూములను తన బినామీలకు కట్టబెట్టాలని చూస్తున్నారని, మూసీ ప్రక్షాళన పేరుతో భూదందా చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయకుండా
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ నామస్మరణ లేనిది రేవంత్ రెడ్డికి నిద్ర పట్టడం లేదని పేర్కొన్నారు.హైదరాబాద్ ను విస్మరించి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ కడుతున్నారని ఆరోపించారు. దమ్ముంటే
సిద్దిపేటలో హరీష్ రావుపై పోటీ చేసి గెలవాలని రేవంత్ రెడ్డి కి సవాల్ విసిరారు.
కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం లేదని అన్నారు.