CM Revanth Reddy | శంషాబాద్ రూరల్, మార్చి 17: సీఎం రేవంత్‌రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు వెళ్లాల్సిన ఇండిగో (6ఈ 5099) విమానానికి పెనుప్రమాదం తప్పింది. ఆదివారం మధ్యాహ్సం 2.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ముంబైకి ప్రయాణికులతో వెళ్తున్న విమానం రన్‌వై పైకి చేరగానే ఇంజన్లో సాంకేతికలోపం తలెత్తింది. వెంటనే గుర్తించిన పైలెట్ విమానాన్ని తిరిగి ల్యాండింగ్ చేశాడు.
విమానంలో ఏర్పడిన సాంకేతిక సమస్యను పరిష్కరించిన తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి ముంబైకి వెళ్లినట్టు ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు తెలిపారు. ఆ విమానంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీతోపాటు పలువురు ప్రముఖులు ఉన్నారు.