హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆలయాల సమాచారంతో ఆధునీకరించిన వైబ్సైట్ ttdevasthanamas.ap.gov.in ను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు.
టీటీడీలో 60కి పైగా ఉన్న స్థానిక, అనుబంధ ఆలయాలకు సంబంధించిన స్థలపురాణం, ఆర్జితసేవలు, దర్శన వేళలు, రవాణా వివరాలు, ఇతర సౌకర్యాలను వెబ్సైట్లో పొందుపరిచారు. ఆలయ విశిష్టతపై ఫొటోలు, వీడియోలను కూడా అందుబాటులో ఉంచారు.