సుబేదారి, జూలై 25 : పోలీస్ శాఖలో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొంది ఏడాది గడిచినా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోవడంతో మానసిక క్షోభకు గురై గుండెపోటుతో రిటైర్డ్ ఇన్స్పెక్టర్ శుక్రవారం మృతి చెందారు. వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరి ముప్పై ఏళ్లకు పైగా సేవలు అందించిన శీలం బాలకృష్ణ గత ఏడాది మే 31న ఇన్స్పెక్టర్ స్థాయిలో విరమణ పొందారు. ఆయనకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.60లక్షల బెనిఫిట్స్ రాకపోవడంతో ఇంటి నిర్మాణం కోసం తీసుకొచ్చిన బ్యాంకు అప్పు, కు టుంబ ఖర్చులు, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెంది బాలకృష్ణ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉండగా ఆరునెలల క్రితం కూతురు చనిపోయింది. బాలకృష్ణ హనుమకొండలోని గోపాల్‌పూర్‌లో ఇళ్లు కట్టుకొని నివాసం ఉంటున్నాడు.