తిరుమల : మేల్కోటేలోని శ్రీ యాదుగిరి యతిరాజ మఠం పీఠాధిపతి యాదుగిరి యతిరాజ నారాయణ రామానుజ జీయర్( Narayana Ramnuja Jeeyar ) బుధవారం ఉదయం తిరుమల ( Tirumala ) శ్రీవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద ఆయనకు ఆలయ అధికారులు , అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు నరేష్ కుమార్, పేష్కార్ రామకృష్ణ పాల్గొన్నారు.
భక్తుల రద్దీ సాధారణం..
వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. నిన్న స్వామివారిని 69,389 మంది భక్తులు దర్శించుకోగా 20,247 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల రూ. 3.72 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వివరించారు. టోకెన్లు లేని భక్తులకు 6 గంటల్లో సర్వదర్శనం అవుతుందని తెలిపారు.