హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే టీచర్లు, ఆయాలు దాదాపు 5 వేల మంది రిటైర్మెంట్ పొందారని, వారికి వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపా రు. శనివారం సంబంధిత అధికారులతో మంత్రి సీతక్క ఫోన్లో మాట్లాడి రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కు సంబంధించిన ఫైల్స్‌పై ఆరా తీశారు. సంబంధిత జీవో ను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే సెక్రటేరియట్ నుంచి పంచాయతీరాజ్ గ్రామీణాభివృ ద్ధి శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్, సెర్ప్ సీఈవో దివ్యాదేవరాజన్, పీఆర్అండ్ ఆర్డీ కమిషనర్ అనితారామచంద్రన్, స్పెషల్ కమిషనర్ షఫీఉల్లాతో కలిసి డీఆర్డీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి హామీలో భాగంగా ఐదునెలల్లో చేపట్టాల్సిన పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
కేరళకు సీఎం, మంత్రులు
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్ రెడ్డితోపాటు పలువురు మంత్రులు శనివారం కేరళకు వెళ్లారు. కొచ్చిన్‌లో ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు సీఎంతోపాటు మంత్రులు శ్రీధర్‌బా బు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్త మ్ కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ ప్రత్యేక విమానంలో వెళ్లారు. తిరిగి రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు.