పెద్దపల్లి, నవంబర్ 23(నమస్తే తెలంగాణ): సింగరేణి యాజమాన్యం ఏటా గణనీయమైన లాభాలు ఆర్జిస్తున్నది. ఆ లాభాలను విశ్రాంత కార్మికుల సంక్షేమానికి వినియోగించడంలో పూర్తిగా విఫలమైంది. ప్రకృతికి విరుద్ధంగా పనిచేసి విరమణ పొందిన కార్మికుల శ్రమ వల్లే నేడు సింగరేణి విజయాలకు మూలమనే విషయాన్ని యాజమాన్యం మరచింది. జీవన వ్యయం పెరుగుతున్నా, పింఛన్లు మాత్రం యథావిధి గా ఉండటం రిటైర్మెంట్ కార్మికులకు శాపంగా మారింది.
ప్రైవేట్ కంపెనీలు ప్రతి ఏడాది కేవలం రూ.10వేల నుంచి రూ.20వేలను కట్టించుకొని రూ.20లక్షల నుంచి రూ.50లక్షల వరకు వైద్య ఖర్చులు భరిస్తుండగా.. యాజమాన్యం మాత్రం ఉద్యోగులు సర్వీసులో ఉండగానే రూ.40వేల వరకు సీపీఆర్ఎంఎస్ కట్టించుకొని కేవలం రూ.8లక్షల వరకు వైద్య ఖర్చులు వర్తింపజేయడంపై నిరసన వ్యక్తమవుతున్నది. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి మెడికల్ సీమ్ ఆన్లిమిట్ చేయాలని, పింఛన్లు పెంచాలని పదవీ విరమణ పొందిన కార్మిక లోకం కోరుతున్నది.
తమ యవ్వనాన్ని, ప్రాణాలను ఫణంగాపెట్టి సింగరేణి సంస్థను మహా గనిగా తీర్చిదిద్దిన విశ్రాంత కార్మికుల గోడును వినేవారు కరువయ్యారు. తమ సమస్యలను ఎవరికీ చెప్పుకోవాలో తెలియక జీవన పోరాటం కొనసాగిస్తున్నారు. ఉండీలేని పెన్షన్, పెరుగుదల లేని పింఛన్, వైద్య సదుపాయాల లేమి విశ్రాంత కార్మికుడి జీవితాన్ని దుర్భరంగా మార్చేశాయి. జీవన వ్యయం పెరుగుతున్నా, పింఛన్ మాత్రం యథాతథంగా ఉన్నది. రిటైర్మెంట్ తర్వాత ఎకువ కాలం బతకడం శాపంగా మారిన పరిస్థితి నెలకొన్నది. అప్పటి ప్రభుత్వాలు లాభాల్లో 10 శాతం వాటా ప్రకటించగా, అది ప్రస్తుతం 34శాతానికి పెరిగింది. లాభాలు వేల కోట్లు దాటినా, ఆ లాభాల్లో విశ్రాంత కార్మికులకు మాత్రం భాగంలేదు. సింగరేణి ‘వన్ ఫ్యామిలీ-వన్ విజన్-వన్ మిషన్’ అనే నినాదాన్ని పెట్టుకున్నా.. ఆ ఫ్యామిలీలలో విశ్రాంత కార్మికులు లేరు.
బొగ్గు గనుల్లో 30 ఏండ్ల పాటు నివసిస్తే 18రకాల జబ్బులు అంతర్లీనంగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగానే సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలు పెద్దఎత్తున జబ్బుల బారినపడుతున్నారు. వయోభారం మీదపడ్డ తర్వాత రెవెన్యూ లేకపోవడంతో అనేక వ్యాధులు అటాక్ చేసే పరిస్థితులు. కార్మికుడికి ఉద్యోగ సమయంలో సర్వీసులో ఉండగానే ప్రతి ఏడాది రూ.40వేల వరకు సీపీఆర్ఎంఎస్ కట్టించుకొని రూ.8లక్షల వరకు మాత్రమే వర్తింపజేయడంపై నిరసన వ్యక్తమవుతున్నది.
అదే ప్రైవేట్ కంపెనీలు కేవలం రూ.10వేల నుంచి రూ.20వేలను కట్టించుకొని రూ.20లక్షల నుంచి రూ.50లక్షల వరకు వైద్య ఖర్చులను చెల్లిస్తున్నారు. గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, కిడ్నీ, క్యాన్సర్, పక్షవాతం వంటి వాటికి అన్లిమిటెడ్గా వైద్యసాయం అందిస్తున్నప్పటికీ.. అన్ని రకాల వైద్య సేవలపై అన్ లిమిటెడ్గా పదవీ విరమణ పొందిన కార్మికులు, వారి కుటుంబాలకు ఖర్చు చేయాలని వారు కోరుతున్నారు.
1998 పెన్షన్ పథకం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సమీక్ష జరగాలి. మూడు దశాబ్దాలుగా ఒకసారి కూడా సమీక్ష జరగలేదు. వేతన సవరణలు, పదోన్నతులు సకాలంలో అమలవుతున్నా విశ్రాంత కార్మికుల పింఛన్ మాత్రం ఎవరికీ గుర్తుకు రావడంలేదు. గ్రాట్యూటీ పెంపు విషయంలో అన్యాయం జరిగింది. సింగరేణిలో రూ. వెయ్యిలోపు పింఛన్ పొందుతున్న వారు సైతం ఉన్నారు. ఇలాంటి వారి పట్ల సంస్థ సానుభూతి చూపి వృథాకు కళ్లెం వేసి ఆదుకోవాలని రిటైర్డ్ కార్మికులు కోరుతున్నారు.
రిటైర్డ్ పొందిన కార్మికులకు వర్తింపజేస్తున్న మెడికల్ సీమ్ ప్రీమి యం తగ్గించాలి. ఈ సీ మ్ ద్వారా రూ.8లక్షల వరకు మాత్రమే అయ్యే ఖర్చు మాత్రమే ఉన్నది. అధికారులకు రూ.25లక్షల వరకు వర్తింపు చేస్తున్నారు. ఇదెకడి న్యాయం. రిటైర్డ్ కార్మికులకు ఆన్లిమిట్గా వైద్య ఖర్చు భరించాలి.
– గౌతమ్ శంకరయ్య,సింగరేణి ఆల్ రిటైర్మెంట్ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు
గతంలో పెన్షన్ విధానం ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. కాలం మారింది ధరలు పెరిగాయి. కానీ రిటై ర్డ్ తర్వాత మమ్మల్ని చూసే విధానం మాత్రం మారలేదు. 20ఏండ్ల క్రితం గోల్డెన్ షేక్హ్యాండ్తో ఉద్యోగ విరమ ణ చేసిన. నాటి నుంచి అతి తకువ పెన్షన్ వస్తున్నది. ఇ దెకడి న్యాయం. దీనికంటే ప్రభుత్వం వృద్ధులకు ఇచ్చే రూ.2వేలే బాగుంది. మేము రిటైర్డ్ కార్మికులం కాబట్టి ప్రభుత్వ పెన్షన్లకు అన్హరులం. అందుకే గనుల్లో పనిచేసిన రిటైర్డ్ కార్మికులకు రూ.10వేల పెన్షన్ ఇవ్వాలి.
– నూనె రాజేశం, రిటైర్డ్ కార్మికుడు, సింగరేణి రిటైర్డ్ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి