హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : ‘ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామం లో ఇటీవల ప్రభుత్వం జరిపిన ఇండ్ల కూల్చివేతలు అమానవీయం. ఆ సమయంలో బాధితులకు కనీస వివరణ ఇచ్చుకొనే సమయమే ఇవ్వలేదు. నిర్దాక్షిణ్యంగా కూల్చివేతలు చేపట్టారు. బాధిత కుటుంబాలపై నిర్దయ చూపారు. ఇండ్లు కోల్పోయిన వారంతా కొత్త ఇంటి పట్టా పొందేందుకు పూర్తి అర్హత కలిగి ఉన్నారు’ అని వెలుగుమట్ల కూల్చివేతలపై రిటైర్డ్ జస్టిస్ బీ చంద్రకుమార్ అధ్యక్షతన ఏర్పాటైన నిజ నిర్ధారణ కమిటీ ఆవేదన వ్యక్తంచేసింది. తుది నివేదికను కమిటీ శుక్రవారం విడుదల చేసింది. ఈ కమిటీలో న్యాయవాదులు, ప్రొ ఫెసర్లు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు సహా వివిధ విభాగాల నుంచి 12మంది ఉ న్నారు. ముందస్తు నోటీసులివ్వకుండా 2వేల మంది పోలీసుల పహారాలో 730 ఇండ్లను నేలమట్టం చేశారని కమిటీ వెల్లడించింది. అధికారులు కర్కశంగా వ్యవహరిస్తూ బాధితుల ఇండ్లను కూల్చివేశారని పేరొన్నది.
భూదాన్ యజ్ఞ బోర్డుకు దానంగా ఇచ్చిన మొత్తం భూమి వివరాలను ప్రభుత్వం స్పష్టం చేయాలని కమిటీ అభిప్రాయపడింది. 1960 నుంచి 1990 మధ్యకాలంలోని అడంగల్ ప హానీల ప్రకారం.. వెలుగుమట్ల సర్వే నంబర్లు 147, 148, 149లలోని 62 ఎకరాల 7 గుం టల భూమి ‘వినోబాభావే’ అని పేరొని, ప్రై వేట్ వ్యక్తులైన ముగ్గురు పేర్ల పైన నమోదై ఉన్నదని గుర్తించింది. కొన్ని రికార్డుల ప్రకారం.. క ల్వల వెంకట రాజారామ్ సర్వేనంబర్లు 147, 148, 149 నుంచి 31 ఎకరాల భూమిని దా నం చేసినట్టు తెలుస్తున్నదని చెప్పింది. జా యింట్ కలెక్టర్(ఖమ్మం) ఉత్తర్వు (నం. పీవోటీ 4/2008, తేదీ: 06-03-2013) ప్ర కారం.. ఎన్ గోపాలకృష్ణారెడ్డి అదే సర్వేనంబర్లలో 31 ఎకరాల 21 గుంటల భూమిని దా నం చేసినట్టు ఉన్నదని కమిటీ గుర్తించింది. బాధితుల కథనం ప్రకారం.. 2014లో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇండ్లు నిర్మించుకోవడానికి 1,800 పట్టాలు ఇచ్చింది. కానీ, కలెక్టర్ వివరణ ప్రకారం.. భూదాన్ బోర్డుకు కేవలం 31 ఎకరాలు మాత్రమే దానం చేసినట్టు తెలిపింది. 2014లో ఎన్నికల కోడ్ ఉన్నందున 1,800 పట్టాలు జారీ చేయడం సాధ్యం కాలేదని, బాధితుల వద్ద ఎలాంటి పట్టాలు లేవని కలెక్టర్ పేరొన్నట్టు కమిటీ తేల్చింది.