మద్దూరు(ధూళిమిట్ట), డిసెంబర్ 3: సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మం డలం లింగాపూర్ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ మద్దతు తో రిటైర్డ్ ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మారెడ్డి నారాయణరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
1977లో ఇరిగేషన్ శాఖలో జేఈగా చేరిన నారాయణరెడ్డి 2010 డిసెంబర్లో ఈఈగా రిటైర్డు అయ్యారు. గ్రామంలోని మెజారిటీ ప్రజల కోరిక మేరకు బుధవారం సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు.