హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): వెస్ట్‌జోన్ ఐజీగా 2004 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి వీబీ కమలాసన్‌రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తూ డీజీపీ మహేందర్‌రెడ్డి సోమవారం ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో వెయిటింగ్లో ఉన్న కమలాసన్‌రెడ్డికి వెస్ట్జోన్తోపాటు హైదరాబాద్, నిజామాబాద్ రేంజ్‌ల డీఐజీల బాధ్యతలు చూడాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొన్నారు.