హైదరాబాద్, జనవరి13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థల్లో పనిచేస్తున్న రెగ్యులర్, కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిషరించాలని తెలంగాణ ప్రభుత్వ ఆల్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టిగారియా) డిమాండ్ చేసింది. ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహులుగౌడ్, ప్రధాన కార్యదర్శి ఎస్ గణేశ్ తదితరులు మంగళవారం ప్రత్యేకంగా కలిశారు. సొసైటీలోని సమస్యలపై వినతిపత్రం అందజేశారు.