హైదరాబాద్, అక్టోబర్ 26(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఆమె రాజీనామాను ఆమోదిస్తూ గురువారం సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయనున్న నేపథ్యంలో తాను పదవికి రాజీనామా చేసినట్టు సునీత తెలిపారు.