కొల్లాపూర్, జూలై 15: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గీయులు 30 మంది బీఆర్ఎస్లో చేరారు. శనివారం మండలంలోని తాళ్ల నరసింహాపురం గ్రామంలో ఎమ్మెల్యే సమక్షంలో మహిళలతోపాటు పలువురు గులాబీ కండువా కప్పుకొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీలో చేరిన వారికి అండగా ఉంటామని, ఈ గ్రామానికి మరో రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.