హుజూరాబాద్, జనవరి 27 : మనీ లాండరింగ్ విషయంలో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులను పశ్చిమ బెంగాల్‌కు చెందిన కోల్‌కతా పోలీసులు రెండ్రోజుల క్రితం పట్టుకెళ్లారు. పట్టణంలో మినరల్ వాటర్ ప్లాంటు కలిగిన ఒకరు, జేసీబీ ఉన్న మరో వ్యక్తి ఇద్దరూ కలిసి కమీషన్‌కు ఆశపడి మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టు తెలిసింది. మనీట్రాన్స్‌ఫర్ కోసం ఇటీవల కోల్‌కతాకు వెళ్లగా.. ఈ విషయం అక్కడి పోలీసులు, ఈడీ అధికారులకు తెలిసింది. మనీ ట్రాన్స్ఫర్ విదేశాల్లో ఉన్న వ్యక్తులతో జరిగినట్టు తేలడంతో కోల్‌కతా పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. అక్కడి పోలీసులు కూపీ లాగడంతో పట్టణానికి చెందిన వ్యక్తులుగా నిర్ధారణకు వచ్చి ఈ విషయాన్ని హుజూరాబాద్ పోలీసులకు తెలిపారు. దీంతో మనీలాండరింగ్‌కు పాల్పడిన సదరు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. మినరల్ వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్న వ్యక్తిపై గతంలో కూడా టీవీ చానళ్ల రేటింగ్ అక్రమాలపై కేసు నమోదైంది.