సూర్యాపేట, ఆగస్టు 25(ఆత్మకూర్.ఎస్) : సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలం పాతర్లపహాడ్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్ (39) అమెరికాలోని స్విమ్మింగ్‌పూల్‌లో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ప్రవీణ్ ఐదేండ్ల క్రితం టీచర్‌గా అమెరికా వెళ్లాడు. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 8 గంటలకు ప్రవీణ్‌కుమార్ సమీపంలోని స్విమ్మింగ్‌పూల్‌కు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో మునిగి మృతి చెందినట్టు అతడి భార్య కుటుంబ సభ్యులకు తెలిపింది.
డెంగ్యూతో యువకుడి మృతి విషజ్వరంతో చిన్నారి..
రామారెడ్డి/కొత్తగూడ, ఆగస్టు 25: రాష్ట్రంలో డెంగ్యూ, విషజ్వరాల బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఆదివారం డెంగ్యూతో యువకుడు, విషజ్వరంతో చిన్నారి మృతిచెందారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌కు చెందిన చిలుక నరేశ్(28) ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. అతడికి మూడ్రోజుల క్రితం జ్వరం రావడంతో కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్చారు. పరిస్థితి విషమించగా హైదరాబాద్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం హనుమాన్తండాకు చెందిన భూక్యా రాజేందర్-సంధ్య దంపతుల కూతురు రూప(18 నెలలు)కు ఐదురోజుల క్రితం జ్వరం రావడంతో నర్సంపేటలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలిస్తుండగా మృతి చెందింది.
కరెంట్ స్తంభం విరిగిపడి బాలుడి మృతి
అలంపూర్, ఆగస్టు 25: విద్యుత్ స్తంభం విరిగి బాలుడిపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో ఆదివారం చోటు చేసుకున్నది. పట్టణంలోని 8వ వార్డులోని తెలుగు మానస, చిన్నమద్దిలేటి దంపతులకు కుమారుడు మహేశ్(4), కూతురు ఉన్నారు. చిన్న మద్దిలేటి ఇంటి పక్కన ఉన్న వారి ఇంట్లో పెండ్లి పందిరి వేసేందుకు చెట్టుకొమ్మలు తొలగిస్తుండగా అవి విద్యుత్‌తీగలపై పడ్డాయి. స్తంభం విరిగి ఇంటి ముందు ఆడుకుంటున్న మహేశ్‌పై పడగా మృతి చెందాడు.