హైదరాబాద్/ఆదిలాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికలకు (Local Body Elections) సంబంధించి ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు రిజర్వేషన్ల ఖరారు వ్యవహారం గందరగోళంగా మారింది. సర్కార్ జారీచేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా జిల్లాల్లో ఎక్కడికక్కడ అధికారులు ఇష్టారీతిన వ్యవహరించారనే విమర్శలొ స్తున్నాయి. ఎస్సీ, ఎస్టీలు ఒక్కరూలేని చోట కూడా ఆయా వర్గాలకు రిజర్వ్ చేయగా, పూర్తి గా ఎస్టీలే ఉన్నచోట ఇతర వర్గాలకు స్థానాలను రిజర్వ్ చేయడమే అందుకు నిదర్శనం. రిజర్వేషన్ల ఖరారులో అధికారులు ప్రభుత్వ మార్గదర్శకాలకు తిలోదకాలిచ్చినట్టు స్పష్టంగా తెలిసిపోతున్నది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. అందుకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఇటీవలనే ఉత్తర్వులను వెలువరించింది. ఎస్సీ, ఎస్టీలకు గతంలో మాదిరిగానే స్థానాలను నిర్ధారించాలని, బీసీలకు మాత్రం 42%స్థానాలను రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
జడ్పీ చైర్మన్ స్థానాలకు పంచాయతీరాజ్ కమిషనర్, జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు జిల్లా కలెక్టర్లు, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలకు ఆర్డీవోలు, వార్డు మెంబర్ల స్థానాలకు ఎంపీడీవోలు రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉన్నది. రిజర్వేషన్లను ఏప్రాతిపదికగా నిర్ణయించాలో కూడా ప్రభుత్వం ఆ మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొన్నది. జనాభా దామాషా ప్రకారం తొలుత ఎస్టీ, ఎస్సీ, బీసీ, తదుపరి మహిళా స్థానాలను ఖరారు చేయాల్సి ఉన్నది. ఆయా స్థానాలకు అనుగుణంగా గ్రామం, మండలం, జిల్లా, ఆపై రాష్ట్రం యూనిట్‌గా నిర్దేశించిన మేరకు స్థానాలను రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా సగం కంటే ఎక్కువగా ఏ జనాభా ఉంటే ఆ వర్గానికి మొదటి ప్రియారిటీగా స్థానాలను రిజర్వ్ చేస్తుంటారు. వెళ్తుంటారు. షెడ్యూల్డ్ ఏరియాలోనూ ఎస్టీలకు మొత్తం స్థానాల్లో సగానికి తగ్గకుండా ఉండాలి. 100% ఎస్టీ జనాభా ఉన్న చోట మొత్తంగా వారికే కేటాయించాల్సి ఉంటుంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఈ నిబంధనలకు విరుద్ధంగా సీట్లను అలాట్ చేసినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనేకచోట్ల ఆశావహులు ఇప్పటికే అభ్యంతరాలను వ్యక్తంచేస్తూ రోడ్డెక్కుతున్నారు.
రొటేషన్ ప్రక్రియలోనూ..
ఆయా స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్ల రొటేషన్ ప్రక్రియను సైతం నిబంధనలకు విరుద్ధంగానే నిర్వహించినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2019కి ముందు ఏర్పడిన పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు మాత్రమే రోటేషన్ వర్తిస్తుంది. 2019 తరువాత ఏర్పడిన నూతన గ్రామపంచాయతీలు, మండలాలు, జిల్లాలకు రొటేషన్ అనేది వర్తించదు. మొదటినుంచి రోస్టర్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. రొటేషన్ ఎలా చేయాలంటే తొలుత ఎస్టీ జనరల్, ఎస్టీ మహిళలు, ఎస్సీ జనరల్, ఎస్సీ మహిళలు, బీసీ జనరల్, బీసీ మహిళలు, జనరల్ స్థానాలుగా మార్చాలి. అయితే ఈ రోటేషన్ క్రమాన్ని కూడా పాటించలేదని తెలుస్తున్నది. అంతేకాకుండా కొన్ని స్థానాలకు 2011 జనాభాల లెక్కలను, మరికొన్ని స్థానాలకు 2024లో నిర్వహించిన ఇంటింటి సర్వే జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవడం కూడా గందరగోళానికి దారి తీసినట్టు పలువురు వివరిస్తున్నారు. కొన్ని స్థానాల రిజర్వేషన్‌ను మార్పు చేయకుండా యథావిధంగా కొనసాగించారని కూడా అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి.
ఉదాహరణలు ఇవీ..
‘