హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : 2025-26 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎప్సెట్ నోటిఫికేషన్ గురువారం విడుదలకానున్నది. ఎప్సెట్ అర్హతలు, షెడ్యూల్ను మధ్యాహ్నం 2:30 గంటలకు వెబ్సైట్లో పొందుపరుస్తారు. తొలిసారిగా ఎప్సెట్లో దివ్యాంగులకు 5శాతం రిజర్వేషన్ వర్తింపజేస్తారు. ఆన్లైన్ దరఖాస్తులు 25 నుంచి ప్రారంభ మై.. ఏప్రిల్ 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సారి ఏపీలో విజయవాడ, కర్నూల్లో పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేస్తారు.