Biological Age | హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ) : వైద్యరంగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం క్రమంగా పెరుగుతున్నది. దీని సాయంతో వ్యక్తు ల బయోలాజికల్ ఏజ్‌తోపాటు క్యాన్స ర్ రోగుల జీవిత కాలం ఎంత ఉన్నదో తెలుసుకోవచ్చని అమెరికాకు చెందిన ‘మాస్ జనరల్ బ్రిగమ్’ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. డీప్ లెర్నింగ్ అల్గారిథంతో కూడిన ‘ఫేస్ ఏజ్’ అనే ఏఐ టూల్‌తో సాధారణ సెల్ఫీని స్కాన్ చేయడం ద్వారా వ్యక్తుల జీవసంబంధ వయసు, ఎంతకాలం జీవిస్తారనే విషయాన్ని తెలుసుకోవచ్చని వెల్లడైంది. అధ్యయనంలో భాగంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న 6 వేల మంది రోగుల ఫొటోలను ‘ఫేస్ ఏజ్’ ఏఐ టూల్‌తో స్కానింగ్ చేశారు. వారి బయోలాజికల్ ఏజ్ సాధారణమైన వ్యక్తుల వయసు కంటే ఐదేండ్లు తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. వివరాలు ‘ది లాన్సెట్ డిజిటల్ హెల్త్’లో ప్రచురితమయ్యాయి.
‘ఫేస్ ఏజ్’ ఏఐ టూల్‌తో క్యాన్సర్ రోగుల జీవసంబంధ వయసుతోపాటు వారు చికిత్సకు ఎలా స్పందిస్తారో తెలుసుకోవచ్చని, తద్వారా మెరుగైన చికిత్స అందించవచ్చని వైద్యనిపుణులు చెప్తున్నారు. సాధారణ వ్యక్తుల కంటే క్యాన్సర్ బాధితులు ఐదేండ్ల పెద్దవాళ్లలా కనిపిస్తారని పరిశోధనలో తేలింది. ఉదాహరణకు ఒక వ్యక్తి ప్రస్తుత వయసు 65 ఏండ్లు, బయోలాజికల్ వయసు పదేండ్లు ఉన్నట్టయితే చికిత్స అందించి అతని జీవిత కాలాన్ని పెంచేందుకు అవకాశం ఉంటుందని ఈ అధ్యయనంలో తేలింది.
ఇది మనలో దేహంలో జరిగే జీవక్రియల తీరును, కణాల స్థితిని సూచిస్తుంది. శరీరంలోని కణాలు, అవయవాలు ఎలా పనిచేస్తున్నా యో అంచనా వేస్తుంది. ఇది వయసుతో సంబంధమున్న వ్యాధు లు, శారీరక క్షీణత ప్రమాదం గురించి తెలుసుకునేందుకు దోహదపడుతుంది. జీవసంబంధమైన వయసు మన జన్యువుల తీరుతోపాటు ఆహార అలవాట్లు, జీవనశైలి, పర్యావరణ పరిస్థితులు తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన వ్యక్తుల అసలైన వయసు కంటే బయోలాజికల్ వయసు తక్కువగా ఉంటుం ది. అనారోగ్య సమస్యలున్న వారిలో అసలైన వయసు కంటే బయోలాజికల్ వయసు ఎక్కువగా ఉంటుంది.