మద్దూరు (ధూళిమిట్ట), జూన్ 1: సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వంగపల్లిలో చాళుక్యుల కాలం నాటి వీరగల్లు విగ్రహాన్ని గుర్తించినట్టు పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన వీరగల్లు విగ్రహ విశేషాలను వెల్లడించారు. గ్రామంలో ని బురుజు వద్ద ఉన్న ఈ విగ్రహాన్ని ఇటీవల దుర్గమ్మ ఆలయం వద్ద గ్రా మస్థులు ప్రతిష్ఠించినట్టు తెలిపారు. ఈ విగ్రహంలో ఉన్న వ్యక్తి వేట కుక్క ల సాయంతో అడవి పందుల నుంచి పంట చేలను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు పోగొట్టుకున్న గ్రామ వీర సైనికుడిగా గుర్తించినట్టు పేర్కొన్నారు.