పటాన్చెరు, ఫిబ్రవరి 8: హైదరాబాద్ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రలోక్కుమార్ సమంతకు భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక విభాగానికి చెందిన పరిశోధనా బోర్డు (సెర్చ్) ప్రాజెక్టును కేటాయించింది. ఈ విషయాన్ని గీతం హైదరాబాద్ అదనపు వీసీ ప్రొఫెసర్ ఎన్ శివప్రసాద్ మంగళవారం తెలిపారు. ఓఎల్ఈడీ అప్లికేషన్ కోసం సేంద్రియ ఉద్గారాల గణన రూపకల్పన పేరిట చేపడుతున్న మూడేండ్ల ప్రాజెక్టుకు రూ.34.69 లక్షల గ్రాంటు మంజూరు చేసినట్టు పేర్కొన్నారు. ఈ పరిశోధనలో సాయపడేందుకు ప్రాజెక్టు ఫెలో అవసరమని, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, అప్లయిడ్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, మెటీరియల్ సైన్స్ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులైనవారు అర్హులని, నెట్/గెట్లో అర్హత సాధించినవారికి ప్రాధాన్యం ఉంటుందని వెల్లడించారు. వివరాలకు 87680 84015ను సంప్రదించాలని, లేదా psamanta@gitam.edu కు ఈ-మెయిల్ చేయాలని సూచించారు.