హైదరాబాద్, మార్చి 21 (నమస్తేతెలంగాణ): కూరగాయలు, పండ్లు ఎకువ కాలం తాజాగా నిల్వ ఉండేందుకు అవసరమైన బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్‌పై పరిశోధనలు అవసరం ఉన్నాయని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం (ఎస్‌కేఎల్‌టీఎస్‌హెచ్‌యూ) వైస్ చాన్స్‌లర్ డాక్టర్ దండా రాజిరెడ్డి పేర్కొన్నారు. మా మిడి, జామ, పొప్పడి, బత్తాయి, దానిమ్మ పంటల్లో చీడపీడలను నిరోధించేందుకు పండ్ల కవర్లు వాడుతున్నారని..
ఎకువ మొత్తంలో కాగితపు కవర్లను వాడడం వల్ల నష్టాలు కూడా ఎదురవుతున్నాయని వాపోయారు. ఈ నేపథ్యంలో బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ వాడకంతో లాభాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు.