హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్స్‌లెన్స్ -2025 అవార్డులను ప్రకటించారు. 2025వ సంవత్సరానికి మహిళాసాధికారత, గిరిజన అభివృద్ధి, రూరల్ హెల్త్ -మెడికల్, కార్పొరేట్ వాలంటరింగ్ అనే నాలుగు రంగాల్లో విశేష సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలను గుర్తించారు. వీరికి ‘గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్’ ప్రదానం చేయనున్నారు.
ఈ నెల 26న లోక్‌భవన్‌లో జరిగే ఎట్‌హోం కార్యక్రమంలో అవార్డులు పంపిణీ చేయనున్నట్టు లోక్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. అవార్డులకు ఎంపికైన వారికి రూ.2 లక్షల నగదుతోపాటు విశిష్ట సేవలను గుర్తించే ప్రశంసాపత్రం గవర్నర్ చేతుల మీదుగా అందజేయనున్నారు. మొదటిసారిగా ఈ అవార్డులను 2024లో ప్రారంభించారు.
వ్యక్తులు..
1.మహిళా సాధికారత – రమాదేవి కన్నెగంటి, హైదరాబాద్
2.గిరిజన అభివృద్ధి – తోడసం కైలాస్, వాఘాపూర్, ఆదిలాబాద్ జిల్లా
3.రూరల్ హెల్త్-మెడికల్ ఫిలాంత్రపీ – డాక్టర్ ప్రద్యుత్ వాఘ్రే, హైదరాబాద్
4.కార్పొరేట్ వాలంటరింగ్ -వీ రాజన్న, హైదరాబాద్
సంస్థలు ..
1.మహిళా సాధికారత -శ్రీ సాయి సోషల్ ఎంపవర్మెంట్ సొసైటీ, ఘట్కేసర్
2.గిరిజన అభివృద్ధి -ఇండిజెనస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(ఐడీవో)గట్టుమల్ల, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా
3.రూరల్ హెల్త్ -మెడికల్ ఫిలాంత్రపీ -రామదేవ్‌రావు హాస్పిటల్, హైదరాబాద్
4.కార్పొరేట్ వాలంటరింగ్- గివ్ ఫర్ సొసైటీ, ఘట్కేసర్