Republic Day | తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అకాడమి డిప్యూటీ డైరెక్టర్ నర్మద ముఖ్య అతిథిగా హాజరై జాతీయజెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనడం ఎంతో గౌరవంగా ఉందని, ఈ అవకాశం ఇచ్చిన అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 1950 జనవరి 26ను విజనరీ లీడర్ల కృషిఫలితంగా రిపబ్లిక్ డేగా పక్రటించుకొని ప్రతి సంత్సరం ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు.
పోలీస్ అధికారులు న్యాయాన్ని పంచే ఉన్నతమైన స్థానంలో ఉన్నందున దేశం మొత్తం మీ వైపే చూస్తున్న దని, రాజ్యాంగ విలువలు కాపాడుతూ కమిట్మెంట్తో పనిచేయాలని సూచించారు. నూతన టెక్నాలజీ ద్వారా నేరాలను ఛేదించి అణగారిన వర్గాల ప్రజలకు న్యాయం చేయాలన్నారు. ప్రజాసేవలో ప్రాణాలర్పించిన పోలీసు అధికారులను స్మరించుకోవాలని కోరారు. ట్రైనీ ఎస్ఐలందరూ శిక్షణ తర్వాత రాజ్యాంగ బద్ధంగా పని చేసేలా స్ఫూర్తి పొందాలని సూచించారు. వేడుకల్లో డిప్యూటీ డైరెక్టర్ ఎన్ వెంకటేశ్వర్లు, మెరిటోరియస్ మెడల్ పొందిన సందర్భంగా అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
ట్రైనీ సబ్ ఇన్స్పెక్టర్స్ కవాతాను డీడీ శ్రీరామమూర్తి పర్యవేక్షించారు. కావతు అనంతరం పిల్లలకు స్వీట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీడీలు వెంకటేశ్వర్లు, శ్రీరామ మూర్తి, అడ్మిన్ ఓఎస్డీ రాఘవరావు, ఏడీలు గంగారెడ్డి, రవీందర్‌రెడ్డి, వెంకట్రావ్, రమణ, భూపాల్, శ్రీనివాస్, శ్రీదేవి, ఎస్పీలు రాంబాబు, సంతోషకుమార్, ఆదూరి శ్రీనివాసరావు, అమృతారెడ్డి, కృష్ణపస్రాద్, దేవరెడ్డి, భాస్కర్, నరహరి, మజీద్, కృష్ణ, శ్రీధరరాజ, జగదీశ్వర్, జీ శ్రీనివాస్, లా ఏడీ రాజేశ్వర్‌రావు, యూఎంఓ రమాదేవి, ఏవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.