హైదరాబాద్ జనవరి 25 (నమస్తే తెలంగాణ): గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సైనిక, పోలీస్ అధికారులకు కేంద్ర హోంశాఖ బుధవారం 901 పతకాలను ప్రకటించింది. వీటిలో 93 రాష్ట్రపతి పోలీస్ పతకాలు, 668 విశిష్ట సేవా పతకాలు (పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్), 140 గ్యాలంట్రీ మెడల్స్ ఉన్నాయి. వీటిలో తెలంగాణకు 15 పతకాలు దక్కాయి. ఇంటెలిజెన్స్ ఏడీజీ అనిల్‌కుమార్, టీఎస్ఎస్పీ 12వ బెటాలియన్ అదనపు కమాండెంట్ బృంగి రామకృష్ణ రాష్ట్రపతి పోలీస్ పతకాలను అందుకోనున్నారు.
దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ రాజారామ్‌కు కూడా రాష్ట్రపతి పోలీస్ పతకాన్ని ప్రకటించారు. వీరితోపాటు మరో 13 మంది తెలంగాణ పోలీసులకు విశిష్ట సేవా పతకాలు ఖరారయ్యాయి. గ్యాలంట్రీ పతకాలకు ఎంపికైన 140 మందిలో అత్యధికంగా 48 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ఉన్నారు. మహారాష్ట్ర నుంచి 31 మంది, జమ్ముకశ్మీర్ నుంచి 25, జార్ఖండ్ నుంచి 9, ఢిల్లీ నుంచి 7, ఛత్తీస్‌గఢ్ నుంచి ఏడుగురు పోలీసులు గ్యాలంట్రీ మెడల్స్‌ను అందుకోనున్నారు. ఈసారి పోలీసు దళాల్లో ఎవరికీ రాష్ట్రపతి అత్యున్నత పోలీసు మెడల్ ఫర్ గ్యాలంట్రీ (పీసీఎంబీ) పురసారాన్ని ప్రకటించలేదు.
తెలంగాణ నుంచి విశిష్ట సేవా పతకాలు అందుకోనున్నది వీరే..