హైదరాబాద్, నవంబర్ 3 ( నమస్తే తెలంగాణ) : మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కొరకు పాటుపడుతున్న భారత రాష్ట్రసమితి (బీఆర్ఎస్)కి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని యునైటెడ్ ముస్లిం ఫోరం తెలిపింది. శుక్రవారం హైదరాబాద్‌లో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి తమ మద్దతును ప్రకటించింది. తెలంగాణ ఏర్పడ్డాక మైనార్టీల స్థితిగతుల్లో గుణాత్మకమైన మార్పు వచ్చిందని, ఇందుకు బీఆర్ఎస్ ప్ర భుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలే కారణమని ఫోరం ప్రతినిధులు తెలిపారు. ముఖ్యం గా, మైనార్టీ గురుకులాల వల్ల అద్భుతమైన భవిష్యత్తు కలిగిన మైనార్టీ యువత తయారవుతున్న విషయాన్ని ప్రస్తావించారు. పేద కుటుంబాల్లోని ముస్లిం యువతులకు షాదీముబారక్ అందిస్తూ వారికి ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని కొనియాడారు.
అభివృద్ధి ఫలాలు అందరికీ సమానం : మంత్రి కేటీఆర్
యునైటెడ్ ఫోరం ప్రతినిధులను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కులాలు, మ తాలు, ప్రాంతాలకతీతంగా అందరికీ అభివృ ద్ధి ఫలాలు సమానంగా అందాలన్న ఒక ఉదాత్తతమైన లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చే స్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏ ర్పడిన తర్వాత కరువు లేదు, కర్ఫ్యూ లేదు అ ని తెలంగాణ మొత్తం గంగ జమున తెహజీబ్ సంస్కృతి వర్ధిల్లుతుందని తెలిపారు. పదేండ్లుగా ఎలాంటి మత ఘర్షణలు లేకుండా ప్ర శాంతమైన వాతావరణంలో అభివృద్ధే మతం గా తెలంగాణ ముందుకు పోతున్నదని చెప్పా రు. బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు తెలిపిన యునైటెడ్ ముస్లిం ఫోరం ప్రతినిధులకు మం త్రి కేటీఆర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మైనార్టీల సంక్షేమానికి మరిన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌కు ఫోరం ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో ఫోరం ప్రతినిధులు మౌలా నా అక్బర్ నిజాముద్దీన్, మౌలానా జియావుద్దీన్ నయ్యర్, సయ్యద్ మసూద్ హుస్సేన్, సయ్యద్ జహీరుద్దీన్ అలీ సూఫీ, సయ్యద్ మునీరుద్దీన్ మక్తుర్, సుజుద్దీన్ ఇఫ్తీకర్, సయ్యద్ ఖాద్రీ, షఫి అలాం తదితరులు ఉన్నారు.