హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని దేవాలయాల పాలకమండళ్లలో కనీసం ఒక బ్రాహ్మణుడికి ప్రాతినిధ్యం కల్పించాలని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం బొగ్గులకుంటలోని బ్రాహ్మణసంక్షేమపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీహెచ్ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అర్హులైన బ్రాహ్మణులు ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన బ్రాహ్మణులు ‘సర్’ ఫారమ్‌లు పూర్తి చేసి అధికారులకు అందజేయాలని కోరారు.
సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో బ్రాహ్మణ ఉద్యమకారుల వివరాలను సేకరించి ఉద్యమ గుర్తింపు కమిటీ చైర్మన్ కే కేశవరావుకు సమర్పిస్తామని చెప్పారు. ఉద్యమకారులందరూ తమ వివరాలు స్వయంగా సమర్పించుకునేలా ఆన్లైన్ నమోదు ప్రక్రియ చేపట్టాలని కమిటీకి సూచించామని వెల్లడించారు. బ్రాహ్మణ సంక్షేమం, సాధికారత, సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పనిచేస్తున్నదని, ప్రభుత్వం అమలు చే స్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతీ బ్రా హ్మణ కుటుంబానికి చేరేలా నిరంతరం కృషి చేస్తామని బసవరాజు శ్రీనివాస్ పేర్కొన్నారు.