హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): కొత్తగూడెం థర్మల్ పవర్‌స్టేషన్ (కేటీపీఎస్‌లో మరోసారి తనిఖీలు నిర్వహించి సమగ్ర నివేదిక అందజేయాలని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)కి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తీసుకున్న చర్యలపై నివేదికతో కూడిన అఫిడవిట్‌ను 3 వారాల్లోగా అందజేయాలని పీసీబీకి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. నీటి కాలుష్య నివారణ, నియంత్రణ చట్టం-1974లోని నిబంధనలను కేటీపీఎస్ పాటించలేదని, వ్యర్థాలను కరవాగు, కిన్నెరసాని నదిలోకి వదిలేస్తున్నారంటూ భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాకు చెందిన దాసరి రమేశ్, మరొకరు వేసిన ప్రజాహిత వ్యాజ్యంపై ధర్మాసనం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.