
న్యూఢిల్లీ, డిసెంబర్ 29: ఇటీవల హరిద్వార్, రాయ్‌పూర్‌లో జరిగిన హిందూ మత సదస్సుల సందర్భంగా పలువురు చేసిన విద్వేష ప్రసంగాలను జాతీయ మైనారిటీ కమిషన్(ఎన్సీఎం) సుమోటోగా పరిగణనలోకి తీసుకున్నది. ఆయా ప్రసంగాలపై ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నివేదిక కోరినట్టు చైర్మన్ ఇక్బాల్ సింగ్ లాల్పుర బుధవారం తెలిపారు. అదేవిధంగా బహిరంగ ప్రాంతాల్లో నమాజ్‌కు సంబంధించి హర్యానాలోని గుర్గావ్లో కొనసాగుతున్న వివాదం, దేశంలోని పలు ప్రాంతాల్లో చర్చిలపై జరుగుతున్న దాడులను కూడా పరిగణనలోకి తీసుకున్నామని పేర్కొన్నారు. వీటిపై చర్యలకు ఆయా రాష్ర్టాలను త్వరలోనే ఆదేశిస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు.