వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్ 23: రాష్ట్రవ్యా ప్తంగా ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూ నివర్సిటీ మాప్ అప్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండో విడత కౌన్సెలింగ్ తర్వాత మిగిలిన సీట్ల ను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హత కలిగిన అభ్యర్థులు ఆదివారం సాయంత్రం 5 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. అలాగే నీట్ కటాఫ్ స్కోర్ తగ్గించిన కారణంగా మాస్టర్ అఫ్ డెంటల్ సర్జరీ (ఎండీఎస్) కన్వీనర్, యాజమాన్య కోటా సీట్ల భర్తీకి మరోసారి కాళోజీ హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హత కలిగిన అభ్యర్థులు ఆదివారం ఉదయం 8 నుంచి 27వ తేదీ సాయంత్రం 5 వరకు ఆన్లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుందని, పత్రాల పరిశీలన తర్వాత మెరిట్ జాబితా విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. సీట్ల ఖాళీ వివరాలను సైట్లో ఉంచా మని, మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్సైట్ను పరిశీలించవచ్చని సూచించారు.