హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): పీఈసెట్‌లో రెండో దశ కౌన్సెలింగ్ ద్వారా 512 సీట్లు భర్తీ చేసినట్టు ప్రొఫెసర్ పీ రమేశ్‌బాబు ఆదివారం ప్రకటనలో తెలిపారు. బీపీఈడీ, యూజీడీపీఈడీ ప్రవేశాల్లో కన్వీనర్ కోటాలో 1,27 9 సీట్లకు 595 మంది వెబ్ ఆప్షన్లు ఎంచుకోగా, వారికి సీట్లు కేటాయించినట్టు తెలిపా రు. వీరిలో బీపీఈడీ అభ్యర్థులు 338 మంది, 174 మంది డీపీఈడీ అభ్యర్థు లు ఉన్నట్టు తెలిపారు. మొదటి విడత కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొందిన వారిలో 458 మంది రిపోర్టు చేసినట్టు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు ఫిజికల్ వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ సర్టిఫికెట్లు, ట్యూషన్ ఫీజు రసీదు, జాయినింగ్ లెటర్‌తో 10 నుంచి 12 వరకు రిపోర్ట్ చేయాలని సూచించారు.
వర్షాల్లో దెబ్బతిన్న 1,253 స్కూళ్లు
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలోని 1,253 స్కూళ్లు ధ్వంసమయ్యాయి. ఈ స్కూళ్లల్లో లీకేజీలు, ప్రహరీలు కూలిపోయినట్టు పాఠశాల విద్యాశాఖ తేల్చింది. జిల్లాలవారీగా తీసుకుంటే గద్వాల 160, నాగర్‌కర్నూల్ 140, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో 100 చొప్పున స్కూళ్లు ధ్వంసం అయినట్టు గుర్తించింది. మరమ్మతులకు రూ.20కోట్లు అవసరమవుతాయని అధికారులు తేల్చారు. ఆయా మొత్తాన్ని కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. వర్షాలు, వరద నష్టంపై సీఎం రేవంత్‌రెడ్డి సోమవా రం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. సమావేశం కోసం అధికారులు క్షేత్రస్థాయి వివరాలు సేకరించారు. అత్యధికంగా పాఠశాల భవనాల పైకప్పు లీకేజీలు ఏర్పడగా, మరమ్మతుల కోసం నిధులివ్వాలని సర్కారుకు నివేదించనున్నారు.