చేవెళ్ల రూరల్, సెప్టెంబర్ 28: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధి పోతుగల్ గ్రామంలోని షాద్‌నగర్-చేవెళ్ల హైవేపై ఏర్పడిన గుంతలను పూడ్చేందుకు వృద్ధులు ముందుకొచ్చారు. గ్రామానికి చెందిన 200 మంది పింఛన్ దారులు (వృద్ధులు) రూ.20 చొప్పున రూ.2 వేలు పోగేసి పంచాయతీ కార్యదర్శి అశోక్‌కు అందజేశారు. ఈ డబ్బులతో కార్యదర్శి శనివారం గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి రోడ్డుకు మరమ్మతులు చేయించారు.
చార్జీల పెంపుపై కమిటీ
హైదరాబాద్, సెప్టెంబర్ 28(నమస్తే తెలంగాణ): ధాన్యం లోడింగ్, అన్‌లోడింగ్‌కు సంబంధించి మండీ లేబర్ చార్జీల పెంపుపై ప్రభుత్వం శనివారం కమిటీ వేసింది. సివిల్‌సైప్లె కమిషనర్ చౌహన్ చైర్మన్‌గా, ఎఫ్‌సీఐ చెన్నై ఈడీ, ఎఫ్‌సీఐ రీజియన్ జీఎం, రాష్ట్ర మండీ బోర్డ్ చైర్మన్, గిడ్డంగుల సంస్థ ఎండీ, కేంద్ర గిడ్డంగుల సంస్థ ఆర్ఎం, వ్యవసాయ శాఖ డైరెక్టర్, కార్మికశాఖ ప్రతినిధి, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సభ్యులుగా ఉండనున్నారు.
లోక్‌అదాలత్‌లో 9.87 లక్షల కేసులు పరిషారం
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో శనివారం లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 9,87,065 కేసులు పరిషారమైనట్టు తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వెల్లడించింది.