హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వాణిజ్య ప న్ను వసూళ్లను మరింత సమర్థంగా ప ర్యవేక్షించేందుకు, భారీగా పన్నులు చె ల్లించేవారిపై ప్రత్యేక నిఘా ఉంచేందు కు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. వాణిజ్య పన్నుల శాఖ కమిషన ర్ కార్యాలయంలో ‘స్టేట్ లార్జ్ ట్యాక్స్ పేయర్స్ యూనిట్’ (c)ను ఏర్పాటు చేయబోతున్నది.
ఈ మేరకు రెవెన్యూ (వాణిజ్య పన్నులు-1) శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు బుధవా రం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రం లో ఎల్టీయూ ఏర్పాటుకు అనుగుణంగా వాణిజ్య పన్నుల శాఖను 19 డివిజన్లు, 121 సరిళ్లుగా పునర్వ్యవస్థీకరించారు. డివిజన్ స్థాయిలో ప్రత్యే క పన్ను చెల్లింపుదారుల విభాగం (ఎస్టీయూ) ద్వారా అగ్రశ్రేణి పన్ను చెల్లింపుదారులను పర్యవేక్షిస్తున్నప్పటికీ, రాష్ట్రస్థాయిలో ఇలాంటి సమగ్రమైన వ్యవస్థ ఇప్పటివరకు లేదు.
నిర్దిష్ట ప్రమాణాల ఆధారంగా పన్ను చెల్లింపుదారులను రాష్ట్రస్థాయి ఎల్టీయూ పరిధిలోకి తీసుకొస్తారు. ఏటా నిర్దేశిత మొత్తం కంటే ఎకువ ఎస్జీఎస్టీ రెవె న్యూ అందించే అగ్రశ్రేణి పన్ను చెల్లింపుదారులు ఈ యూనిట్ పరిధిలోకి వస్తారు. అన్ని రకాల జీఎస్టీ చట్టాల కింద ఏటా నిర్దేశిత పరిమితికి మించి రీఫండ్లు పొందే వ్యాపారులతోపాటు పెట్రోలియం ఉత్పత్తులు, మానవ వి నియోగానికి ఉపయోగించే మద్యం వంటి నాన్-జీఎస్టీ వస్తువుల వ్యాపా రం చేస్తూ వ్యాట్ చట్టం కింద భారీగా పన్నులు చెల్లించే ప్రముఖులు కొత్త విభాగం పరిధిలోకి వస్తారు. ఈ విభాగానికి జాయింట్ కమిషనర్ లేదా అడిషనల్ కమిషనర్ హోదా గల అధికారి నేతృత్వం వహిస్తారు.