హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): మాడల్ స్కూల్స్, గురుకులాలకు ఇంటర్ ప్రాక్టికల్ సెంటర్ల తొలగింపుపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తంచేశాయి. ప్రైవేట్ కాలేజీలకు సెంటర్లు కేటాయించి, ప్రభుత్వ విద్యాసంస్థలకు సెంటర్ల తొలగింపు అన్యాయమని మండిపడ్డాయి. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని తెలంగాణ మాడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భూతం యాకమట్టు, ప్రొగ్రెసీవ్ మాడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీశ్ డిమాండ్ చేశారు.