కరీంనగర్ కార్పొరేషన్, జనవరి 22: కరీంనగర్ నడిబొడ్డున అద్భుతంగా నిర్మించిన కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ (కేసీఆర్) హౌస్ బోర్డును సోమవారం తొలగించారు. దశాబ్దాల కింద నిర్మించిన కరీంనగర్ ఆర్అండ్బీ అతిథి గృహం శిథిలావస్థకు చేరుకోవడంతో గత ప్రభుత్వం రూ.7.50 కోట్లు వెచ్చించి జీప్లస్ వన్ పద్ధతిలో అద్భుతంగా నిర్మించింది. ఈ భవనానికి పెట్టిన బోర్డును ఎవరు తొలగించారనేది ఆర్అండ్బీ అధికారులు కూడా సృష్టత ఇవ్వడం లేదు. కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్‌ను కేసీఆర్ హౌస్‌గా పిలుస్తున్నారన్న అక్కసుతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బోర్డు తొలగించదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.