హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన 16 మంది ఎక్స్టర్నల్ లెక్చరర్స్, ల్యాబ్ అసిస్టెంట్ సిబ్బందిపై ఇంటర్మీడియట్ బోర్డు క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 2 నుంచి 4 వరకు కెమిస్ట్రీ, ఫిజిక్స్, బోటనీ ప్రాక్టికల్ పరీక్షలు జరిగాయి.
ఈ సందర్భంగా విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు మాస్‌కాపీయింగ్, ఇతరులతో ప్రా క్టికల్ సమాధాన పత్రాలను దిద్దించడం వంటి చర్యలకు పాల్పడినట్టు బోర్డు నిర్ధారించింది. దీంతో విధుల్లో అలసత్వం వహించిన 16 మందిని విధుల నుంచి తొలగించింది. వీరికి భవిష్యత్తులో ఇంటర్ బోర్డు నిర్వహించే ప్రాక్టికల్స్‌తోపాటు వార్షిక పరీక్షల విధులకు హాజరుకాకుండా నిషేధం విధించింది. ఈ మేరకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ బుధవారం ఆదేశాలు జారీచేశారు.