హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ అగ్నిమాపకశాఖ కొత్త రెస్క్యూ సామగ్రిని సిద్ధం చేసుకుంటున్నది. ఆధునిక రి మోట్ ఆపరేటింగ్ లైఫ్బాయ్స్ను కొ నుగోలు చేసింది. వాటి ద్వారా ఎలాం టి ప్రాణ నష్టం సంభవించకుండా ఉండేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు ఆ శాఖ డీజీ వై నాగిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాటితో అగ్నిమాపక సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. రా ష్ట్రం నలుమూలల నుంచి 258 మం ది సిబ్బందికి, 15 మంది అగ్నిమాపకశాఖ అధికారులకు వాటర్ రెస్యూ ఆపరేషన్, బోటు ఆపరేషన్స్, రిమోట్ లైఫ్‌బాయ్స్, ఇతర రెస్యూ ఆపరేషన్లలో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చినట్టు వివరించారు. కరీంనగర్‌లోని లోయర్ మానేర్ డ్యామ్, గోదావరి నది, భద్రాచలం, హుస్సేన్‌సాగర్, హైదరాబాద్‌లో శిక్షణ నిర్వహించినట్టు వెల్లడించారు. వాటర్ రెస్క్యూలో అగ్నిమాపకశాఖ నుంచి 90 మంది ఎస్డీఆర్ఎఫ్లో శిక్షణ పొందినట్టు చెప్పారు.