మతం, గొడవలను నమ్ముకొంటే కష్టం
‘మతం పేరుతో రెచ్చగొట్టడం, ప్రజలను విభజించడం, ఘర్షణ వాతావరణంతో లబ్ధి పొందాలన్న వ్యూహాలు దక్షిణాది రాష్ర్టాల్లో పనిచేయవు. అందుకే దక్షిణాది నుంచి ప్రజాకర్షణ కలిగిన, బలమైన, యువ నేతలను తయారు చేయలేకపోతున్నాం
- ఉత్తరాది వ్యూహాలు దక్షిణాదిలో పనిచేయవు
- బీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి కృష్ణసాగర్రావు వ్యాఖ్యలు
హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): ‘మతం పేరుతో రెచ్చగొట్టడం, ప్రజలను విభజించడం, ఘర్షణ వాతావరణంతో లబ్ధి పొందాలన్న వ్యూహాలు దక్షిణాది రాష్ర్టాల్లో పనిచేయవు. అందుకే దక్షిణాది నుంచి ప్రజాకర్షణ కలిగిన, బలమైన, యువ నేతలను తయారు చేయలేకపోతున్నాం.
దక్షిణాది, ఉత్తరాదిలలో సామాజిక పరిస్థితులు, చారిత్రక నేపథ్యం భిన్నమైనవి. బీజేపీ అధిష్ఠానం వెంటనే గుర్తించి, ఇలాంటి వాటిని ఉత్తరాదికే పరిమితం చేయాలి’ అని కుండబద్దలు కొట్టారు బీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి కృష్ణసాగర్రావు. దక్షిణాదిలో గెలవాలంటే బీజేపీ మూలసూత్రాల్లోకి వెళ్లాలని, పార్టీ స్థాపించినప్పటి సిద్ధాంతాలను ప్రచారంలోకి తేవాలన్నారు. తెలంగాణలో తాము బలపడటానికి కాంగ్రెస్ అడ్డంకిగా ఉన్నదని, తమ పార్టీ పట్టణ ప్రాంతాలకే పరిమితమైందని ఆయన ఓ జాతీయ మీడియాతో వ్యాఖ్యానించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

