రాఖీ పండగ పూట మత సామరస్యం వెల్లివిరిసింది. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలకేంద్రంలో ముస్లిం యువతి షాహినా బేగం శనివారం పలువురు యువకులకు రాఖీ కట్టింది. ‘అన్నా’ అంటూ స్వీటు తినిపించి అనుబంధాన్ని చాటుకున్నది.
సుమారు 40ఏండ్ల తర్వాత తన అన్నకు రాఖీ కట్టి అనుబంధాన్ని చాటుకున్నది ఓ మహిళ. వివరాల్లోకి వెళ్లే..40 ఏండ్ల క్రితం మావోయిస్ట్ దళంలో చేరిన కేంద్ర కమిటీ సభ్యురాలు బత్తుల గాంబాలు ఉరఫ్ పసుల వసంత నాలుగు నెలల క్రితం ఛత్తీస్గఢ్లో లొంగిపోయింది. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన తన అన్న బత్తుల రాజంకు శనివారం ఆమె రాఖీ కట్టారు. 40ఏండ్ల తర్వాత తన అన్నకు రాఖీ కట్టడం సంతోషంగా ఉన్నదని గాంబాలు తెలిపారు.