హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఏపీలో నియమితులైన 1,200 మంది మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2013లో ఏపీలో కారుణ్య కారణాలతో జరిగిన నియామకాలపై స్పష్టత ఇచ్చింది. ప్రభు త్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టులో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లు (పురుషులు) సవాలు చేశారు. మల్టీపర్పస్ అసిస్టెంట్లు దా ఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ అరవింద్కుమా ర్, జస్టిస్ ఎన్వీ అంజారియా ధర్మాసనం విచా రించింది. పదో తరగతితోపాటు డిప్లొమా ఉన్నవారు అర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ను నాడు హైకోర్టు, సుప్రీంకోర్టు సమర్థించాయి. ఇంటర్ అర్హతతో అపాయిం ట్ అయిన 1,200 మందిని కోర్టు ఉత్తర్వుల తో ప్రభుత్వం టర్మినేట్ చేసింది.
తిరిగి వీరికి న్యాయం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2013లో 1207 జీవో తీసుకువచ్చింది. 1,200 మందిని కారుణ్య నియామకాల ద్వారా విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. 2013లో తీసుకువచ్చిన జీవోను పలువురు అభ్యర్థులు హైకోర్టులో సవాలు చేశారు. విచారించిన హైకోర్టు నవంబర్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతూ జీవోను కొట్టివేసింది. దీనిపై అర్హులు సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయం చేయాలని విన్నవించారు. మానవతా దృక్పథంతో తీసుకువచ్చిన జీవోను అ మలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్ర భుత్వం కోర్టుకు తెలిపింది. 1200 మందిలో ఏపీలో ఉన్న వారందిరినీ విధుల్లోకి తీసుకుంటామని ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇరువురి వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజనకు ముందు జరిగిన నియామకాల ప్రక్రియ కాబట్టి ఏపీతో పాటు తెలంగాణ కూడా ఈ ఉత్తర్వులు అమలు చేయాలని ఆదేశించింది.