ఉమ్మడి ఏపీలో నియమితులైన 1,200 మంది మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2013లో ఏపీలో కారుణ్య కారణాలతో జరిగిన నియామకాలపై స్పష్టత ఇచ్చింది.
కేరళలోని త్రిసూర్‌లో 65 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు 12 గంటల సమయం పడుతుంటే రూ. 150 టోల్ ఫీజు ఎందుకు చెల్లించాలని భారత జాతీయ రహదారుల సంస్థ(ఎన్హెచ్ఏఐ)ను సుప్రీంకోర్టు సోమవారం నిలదీసింది.