హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారన్న అభియోగంతో 2023 నవంబర్ 29న కమలాపుర్ పోలీసు స్టేషన్లో నమోదైన కేసులో బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి ఊరట లభించింది. ఈ కేసు విచారణ నిమిత్తం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేకుండా హైకోర్టు ఆయనకు మినహాయింపు ఇచ్చింది. కౌంటర్ దాఖలు నిమిత్తం ప్రతివాదులకు నోటీసులు జారీచేసి, తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేశారు.